SR Kalyanamandapam Collections : యువ హీరో కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్ హీరో హరోయిన్స్‌గా వచ్చిన తాజా చిత్రం ఎస్ఆర్ కళ్యాణమండపం. శ్రీధర్ గాదె దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఆగస్టు 6న ప్రపంచవ్యాప్తంగా విడుదలైం
యువ హీరో కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్ హీరో హిరోయిన్స్‌గా వచ్చిన చిత్రం ఎస్ఆర్ కళ్యాణమండపం. శ్రీధర్ గాదె దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఆగస్టు 6న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. కరోనా సెకెండ్ వేవ్ తర్వాత ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమాల్లో మంచి బజ్ తెచ్చుకుంది ఈ సినిమా. అవ్వడానికి చిన్న సినిమానే అయిన సాంగ్స్ సూపర్ హిట్ అవ్వడంతో పాటు ట్రైలర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకోవడంతో సినిమా పై ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 500 వరకు థియేటర్స్ విడుదలైంది. ఇక కలెక్షన్ విషయానికి వస్తే.. ఏడు రోజుల్లో ఈ సినిమా ఎవరు ఊహించనంత కలెక్ట్ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. బాక్స్ ఆఫీస్ దగ్గర సెకెండ్ వేవ్ తర్వాత విడుదలై అదరగొట్టింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వీకెండ్‌లో సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. ఏడవ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 37 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని.. మొదటి వారంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్ల గ్రాస్ మార్క్ అందుకుంది. వరల్డ్ వైడ్‌గా 12 కోట్ల గ్రాస్‌ను తాకింది.
ఎస్ఆర్ కళ్యాణమండపం ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 4.55 కోట్లకు జరిగింది. దీంతో 4.8 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఈ కలెక్షన్స్‌ను బట్టి చూస్తే.. ఈ సినిమా సూపర్ హిట్ అని అంటున్నారు ట్రేడ్ పండితులు.. సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరంతో పాటు సీనియర్ నటుడు సాయి కుమార్ ఇందులో మరో ప్రధాన పాత్రను పోషించారు. ఎలైట్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ప్రమోద్, రాజు నిర్మించారు. హీరో కిరణ్ అబ్బవరం కథతో పాటు స్క్రీన్‌ప్లే, మాటలను అందించడం విశేషం. చైతన్ భరద్వాజ్ సంగీతం సమకూర్చారు.